11గంటలకే బడ్జెట్.. చిగురిస్తున్న ఆశలు
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఇది 9వ వార్షిక బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ గురించి దేశ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిపుణులు సైతం కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా ఈ ఆర్థిక బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే విషయంలో మనదేశం ప్రథమస్థానంలో ఉంది. కరోనా […]
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఇది 9వ వార్షిక బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ గురించి దేశ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిపుణులు సైతం కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా ఈ ఆర్థిక బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే విషయంలో మనదేశం ప్రథమస్థానంలో ఉంది. కరోనా వల్ల ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెట్టినా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో బడ్జెట్‌పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.దీనికి తోడు కొద్దిరోజుల క్రితం కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను గతంలో చూడలేదన్నారు.
2021 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 7-8 శాతం తగ్గుతుందనే అంచనా. కరోనా, లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. మరి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతుందనేది చర్చాంశనీయంగా మారింది.