పోలింగ్‌కు అంతా రెడీ.. ఇక ఫలితాలను తేల్చేది వారేనా!

ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ వ్యాప్తంగా 5,31,268 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 799 పోలింగ్​కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తి చేశారు. 3,835మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈ నెల 14న ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​నిర్వహించనున్నారు. ఎల్బీనగర్​స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు […]

Update: 2021-03-11 14:03 GMT

ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ వ్యాప్తంగా 5,31,268 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 799 పోలింగ్​కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తి చేశారు. 3,835మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈ నెల 14న ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​నిర్వహించనున్నారు. ఎల్బీనగర్​స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. ఈ ఎన్నికల్లో 93మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్​బాక్సులను సిద్ధం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల14 వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియం కేంద్రంగా పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 17న ఎల్బీనగర్ – సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నెల 22న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. తొమ్మిది జిల్లాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు పోలింగ్​లో పాల్గొననున్నారు. 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 5,31,268 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్రీలు, 68 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్-మల్కాజి గిరిలో 1,31,284 మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా నారాయణ పేట్ జిల్లాలో 13,899 మంది మాత్రమే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 35,510 మంది ఓటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 33,924 , వన పర్తి జిల్లాలో 21,158 , జోగులాంబ గద్వాల్ లో 14,876 , రంగారెడ్డి జిల్లాలో 1,44,416 , వికారాబాద్ లో 25,958, హైదరాబాద్ జిల్లాలో 1,10,243 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల కోసం మొత్తం 3,835 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 959 మంది పీఓలు, ఓపీటీలు 2,876 మంది ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగడానికి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజవర్గంలో 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మహబూబ్ నగర్ జిల్లాలో 56 , నాగర్ కర్నూల్ జిల్లాలో 44 , వనపర్తి జిల్లాలో 31, జోగులాంబ గద్వాల్ లో 22 , నారాయణపేట్ లో 20 , రంగారెడ్డి జిల్లాలో 199 , వికారాబాద్ లో 38 , మేడ్చల్ మల్కాజిగిరి లో 198 హైదరాబాద్ జిల్లాలో 191 ఉన్నాయి. ఈ నెల 14 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ చేపట్టనున్నారు. ఎన్నికల బరిలో 93 మంది అభ్యర్థులు నిలవడంతో జంబో బ్యాలెట్ పేపర్‌తో పాటు జంబో బ్యాలెట్ బాక్స్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 1,598 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తుండగా, అదనంగా 324 బాక్సులను సిద్ధంగా ఉంచారు. జిల్లాల వారీగా మహబూబ్ నగర్ జిల్లాకు 269 బాక్సులు, నాగర్ కర్నూల్ జిల్లాకు 212 , వనపర్తి జిల్లాకు 149 , జోగులాంబ గద్వాల్ కు 106 , నారాయణపేట్​కు 96 , రంగారెడ్డి జిల్లాకు 956 , వికారాబాద్ కు 183 , మేడ్చల్ మల్కాజిగిరి కి 951 , హైదరాబాద్ జిల్లాకు 917 బ్యాలెట్ బాక్స్‌లను కేటాయించారు.

Tags:    

Similar News