హస్తకళాకారులకు ప్రేమతో.. ఆలియా

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి వేళ.. అందరూ సంప్రదాయబద్ధ వస్త్రాల్లో మెరిసిపోయారు. అయితే ఈ దీపావళి రోజునే ‘చిల్డ్రన్స్ డే’ కూడా కావడంతో ఈ రెండు వేడుకల్ని కలిసి జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సైతం ఈ రెండు పండుగలను సెలెబ్రేట్ చేసుకుంది. తన ఔట్‌ఫిట్స్‌తో ఎప్పుడూ ఏదో ఒక సందేశమిచ్చే ఆలియా.. ఈ సారి కూడా పింక్ లెహెంగాతో ‘లేబర్ ఆఫ్ లవ్’ను చాటింది. 35 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ చిన్నారులు వేసిన చిత్రాలను […]

Update: 2020-11-15 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి వేళ.. అందరూ సంప్రదాయబద్ధ వస్త్రాల్లో మెరిసిపోయారు. అయితే ఈ దీపావళి రోజునే ‘చిల్డ్రన్స్ డే’ కూడా కావడంతో ఈ రెండు వేడుకల్ని కలిసి జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సైతం ఈ రెండు పండుగలను సెలెబ్రేట్ చేసుకుంది. తన ఔట్‌ఫిట్స్‌తో ఎప్పుడూ ఏదో ఒక సందేశమిచ్చే ఆలియా.. ఈ సారి కూడా పింక్ లెహెంగాతో ‘లేబర్ ఆఫ్ లవ్’ను చాటింది. 35 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ చిన్నారులు వేసిన చిత్రాలను తన లెహంగా మీద వేసుకుంది. ఈ లెహెంగాను ఆలియా స్టైలిస్ట్ అమి పటేల్ రూపొందించారు. కాగా ఈ ఔట్‌ఫిట్‌ను రూపొందించేందుకు 13 మంది హస్తకళాకారులు నాలుగు నెలలు కష్టపడ్డారని అమి తెలిపాడు. అంతేకాదు 100 శాతం వేస్ట్‌ మెటీరియల్‌తో తయారుచేసిన ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌తో ఈ లెహెంగాను రూపొందించడం విశేషం.

‘నేను ఈ దివాళీకి సమ్‌థింగ్ డిఫరెంట్‌గా చేయాలనుకున్నాను. అందువల్లే నేను ఈ భిన్నమైన దుస్తుల్ని ధరించాను. ఈ లెహెంగా ‘లేబర్ ఆఫ్ లవ్’కు చిహ్నం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రీ స్కూల్ చిన్నారుల పేర్లతో పాటు ఈ ఔట్‌ఫిట్ కోసం నెలల తరబడి కష్టపడ్డ ఎంతోమంది హస్తకళాకారులు పేర్లను కూడా ఎంబ్రాయిడరీగా వేసుకున్నాను. హ్యాపీ దివాళీ’ అని ఆలియా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Tags:    

Similar News