తెలుగు పాఠాలు మొదలెట్టిన అలియా
బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్.. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రుధిరం రణం(ఆర్‌ఆర్‌ఆర్)’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అలియా తప్పుకుందని ఈ మధ్య వార్తలొచ్చినా.. అదంతా ఫేక్ అని తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసమే మళ్లీ తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టిందట అలియా. ఇందుకోసం లాక్‌డౌన్‌కు ముందే తెలుగు ట్యూటర్‌ను పెట్టుకున్నా.. కరోనా కారణంగా కొద్ది రోజులకే పాఠాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తేయడం.. జక్కన్న […]
బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్.. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రుధిరం రణం(ఆర్‌ఆర్‌ఆర్)’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అలియా తప్పుకుందని ఈ మధ్య వార్తలొచ్చినా.. అదంతా ఫేక్ అని తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసమే మళ్లీ తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టిందట అలియా. ఇందుకోసం లాక్‌డౌన్‌కు ముందే తెలుగు ట్యూటర్‌ను పెట్టుకున్నా.. కరోనా కారణంగా కొద్ది రోజులకే పాఠాలకు బ్రేక్ పడింది.
ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తేయడం.. జక్కన్న సినిమా షూటింగ్‌ను త్వరలో మొదలు పెట్టే చాన్స్ ఉండటంతో ఇక మళ్లీ తెలుగు భాషపై పట్టు సాధించే పనిలో ఉందట అలియా. భాష అర్థం కాకపోతే నటన కష్టం కాబట్టి తెలుగు నేర్చేసుకుందామని నిర్ణయించుకుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు అభ్యసన ప్రక్రియలో ఉన్న అలియా.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనే చాన్స్ ఉందని సమాచారం.
ఆర్ఆర్ఆర్‌లో తారక్ కొమురం భీమ్‌గా కనిపిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టనున్నాడు. చెర్రీకి జోడీగా ‘సీత’ పాత్రలో కనిపించనున్న అలియా.. తారక్, చెర్రీలకు ధీటైన పాత్రలో నటించనుందట.