ఆస్పత్రిలో చేరిన ఆలియా భట్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ ఆస్పత్రిలో చేరారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయిన ఆలియా.. చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నారు. సోమవారం మళ్లీ యథావిధిగా షూటింగ్ హాజరైన ఆమె హెల్త్ నార్మల్‌గానే ఉన్నట్లు సమాచారం. ఎక్కువగా అలసిపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు వైద్యులు. కాగా, న్యూ […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ ఆస్పత్రిలో చేరారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయిన ఆలియా.. చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నారు. సోమవారం మళ్లీ యథావిధిగా షూటింగ్ హాజరైన ఆమె హెల్త్ నార్మల్‌గానే ఉన్నట్లు సమాచారం.
ఎక్కువగా అలసిపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు వైద్యులు. కాగా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ వెళ్లిన అలియా.. రణ్‌బీర్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వెంటనే ఎలాంటి రెస్ట్ లేకుండా షూటింగ్ ప్రారంభించింది. ఆలియా నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా 2021లో రిలీజ్ కానుండగా..‘బ్రహ్మాస్త్ర’ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ ప్రాజెక్ట్‌లతో ఆలియా..బిజీగా ఉంది.