దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్.. పెనుప్రమాదం తప్పేనా..?

దిశ, ఫీచర్స్ : ఆస్టరాయిడ్ల నుంచి ఎప్పుడూ భూమికి ముప్పే. గ్రహ శ‌క‌లాలు ఎన్నోసార్లు భూమికి ద‌గ్గర‌గా వెళ్తుండ‌గా.. కొన్ని చిన్న చిన్నవి భూమిని ఢీకొట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. భ‌విష్యత్తులోనూ భారీ గ్రహశకలాలు భూ గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్టేడియం పరిమాణమంత పెద్దదిగా ఉన్న ఓ భారీ గ్రహశకలం అధిక వేగంతో భూమి వైపు వస్తోంది. ఈ మేరకు యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు దానిపై నిరంతరం […]

Update: 2021-07-20 02:12 GMT

దిశ, ఫీచర్స్ : ఆస్టరాయిడ్ల నుంచి ఎప్పుడూ భూమికి ముప్పే. గ్రహ శ‌క‌లాలు ఎన్నోసార్లు భూమికి ద‌గ్గర‌గా వెళ్తుండ‌గా.. కొన్ని చిన్న చిన్నవి భూమిని ఢీకొట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. భ‌విష్యత్తులోనూ భారీ గ్రహశకలాలు భూ గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్టేడియం పరిమాణమంత పెద్దదిగా ఉన్న ఓ భారీ గ్రహశకలం అధిక వేగంతో భూమి వైపు వస్తోంది. ఈ మేరకు యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు దానిపై నిరంతరం నిఘా ఉంచారు. మరి దీనివల్ల భూమికి ప్రమాదముందా?

గంటకు 8 కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తున్న ఆ ఆస్టరాయిడ్‌ని ‘2008 Go20’‌గా పిలుస్తున్నారు. ఈ వేగంతో ఒక గ్రహం లేదా వస్తువును అది ఢీకొన్నట్లయితే అవి పూర్తిగా నాశనమవుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిమాణం పరంగా ఇది 220 మీటర్ల వెడల్పు ఉంది. అంటే దాదాపు చైనా బర్డ్స్ నెస్ట్ స్టేడియానికి సమానం కాగా.. జూలై 24 అర్ధరాత్రి భూమికి దగ్గరగా రానుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ గ్రహశకలం భూమికి 28,70,847.607 కిలోమీటర్ల దూరంలో(భూమి నుంచి చంద్రుని దూరం కంటే 8 రెట్లు ఎక్కువ) ఉన్నందున ఎర్త్‌ను తాకే అవకాశం చాలా తక్కువని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఆస్టరాయిడ్స్ వెళ్ళే కక్ష్యను అపోలో అంటారు. దీనిని నాసా ప్రమాదకరమైన గ్రహశకలాల విభాగంలో చేర్చడంతో పరిశోధకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అపోలో భూమికి సమీపంలో ఉన్నందువల్ల ఎప్పుడైనా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని అంచనా.

ఆస్టరాయిడ్స్ అవి వెళ్లేదారిలో మరేదైనా గ్రహశకలం వాటిని ఢీకొంటే వాటి కక్ష్య మారిపోతుంది. దాంతో అది ఎటువైపు వస్తుందో తెలియదు. భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక సూర్యుడి వేడి కారణంగా కూడా ఆస్టరాయిడ్స్ దాని మార్గాన్ని కొద్దిగా మార్చుకుంటుంది. దీనిని ‘యార్కోస్కీ’ (Yarkovsky) ప్రభావం అంటారు. దిశ మారినప్పుడు దాని వేగం కూడా మారుతుంది. కొన్నిసార్లు అది నెమ్మదిగా లేదా వేగంగా పడిపోవచ్చు. ఇక అంతరిక్షంలో ఆ గ్రహశకలం వైపు వచ్చే వస్తువులకు ప్రమాదకరమనే నాసా చెబుతోంది.

ఇటీవల కాలంలో గ్రహశకలం 2020 PMZ భూమి కక్ష్య గుండా వెళ్ళింది. ఇది సుమారు 18 లక్షల మైళ్ళ దూరం నుంచి భూమిని దాటింది.

Tags:    

Similar News