బెల్ట్ షాపులకు మస్తు గిరాకీ..
దిశ, మేడ్చల్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో బెల్ట్‌షాపులకు పంట పండుతోంది. మద్యం దుకాణాలు మూసేయడంతో..బెల్ట్ షాపులకు ఫుల్లు గిరాకీ ఉంటోంది. జిల్లాలో ఒక్కో బీరుపై రూ.వంద, ఫుల్ బాటిల్‌కు రూ.400 అదనంగా బెల్ట్ షాపుల వాళ్లు తీసుకుంటున్నారు. అయితే, బెల్ట్ షాపుల వారు వైన్స్ యజమానులతో మాట్లాడుకుని ముందస్తుగానే మద్యం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ‘‘కర్ఫ్యూ’’ నుంచి షురూ.. కేంద్రం ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు అత్యవసర సేవలు మినహా […]
దిశ, మేడ్చల్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో బెల్ట్‌షాపులకు పంట పండుతోంది. మద్యం దుకాణాలు మూసేయడంతో..బెల్ట్ షాపులకు ఫుల్లు గిరాకీ ఉంటోంది. జిల్లాలో ఒక్కో బీరుపై రూ.వంద, ఫుల్ బాటిల్‌కు రూ.400 అదనంగా బెల్ట్ షాపుల వాళ్లు తీసుకుంటున్నారు. అయితే, బెల్ట్ షాపుల వారు వైన్స్ యజమానులతో మాట్లాడుకుని ముందస్తుగానే మద్యం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
‘‘కర్ఫ్యూ’’ నుంచి షురూ..
కేంద్రం ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు అత్యవసర సేవలు మినహా అన్నీ క్లోజ్ చేశారు. వైన్స్‌లూ బంద్ అయ్యారు. ఆ రోజు నుంచి మూడ్రోజులుగా ప్రజలు ఇంటికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులకు మస్తు డిమాండ్ పెరిగింది. మందు బాబులు బెల్టు షాపుల్లో అదనంగా డబ్బులు ఇచ్చి మరీ మద్యం కొనుక్కుంటున్నారు. అల్ట్రా బీర్‌పై రూ.150, బ్రాండ్ లిక్కర్‌పై రూ.700 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ మందుబాబులు వెనక్కి తగ్గడంలేదు. అయితే, వైన్ షాపుల ఈ నెల 23 నుంచి యథావిధిగా కొనసాగుతాయని భావించి 21వ తేదీ రాత్రే మద్యం పెద్ద మొత్తంలో డంప్ చేసుకున్నారు. కాని లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో అక్కడక్కడ వైన్ షాపుల నుంచి ఉదయం వేళల్లో సీక్రెట్‌గా ఓపెన్ చేసి బెల్ట్ షాపులకు తరలించారు. కొన్ని చోట్ల తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఇప్పటికే ఈ నెల 15 నుంచి పబ్‌లు, బార్‌లు, పర్మిట్ రూమ్‌లు బంద్ చేశారు. దీంతో ఎక్సైజ్ రెవెన్యూ తగ్గింది. వీటి బంద్‌తో ఇప్పటికే 200 కోట్ల రూపాయల వరకు సేల్స్ తగ్గిపోయాయి. సాధారణ రోజుల్లో లిక్కర్ సేల్స్‌తో నెలకు రూ. 1600 నుంచి రూ. 1800 కోట్ల రెవెన్యూ ఉంటుంది. రోజుకు 60 నుంచి 70 కోట్ల సేల్స్ ఉంటాయి. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో మొత్తం పది రోజుల్లో 600 కోట్ల వరకు సేల్స్ నిలిచిపోనున్నట్టు తెలుస్తోంది.
అయితే, బెల్ట్ షాపుల్లో ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.