‘U – టర్న్’ తీసుకున్న యంగ్ బ్యూటీ..

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్‌వాలా తన తొలి సినిమా ‘జవానీ జానేమన్’ సినిమాతో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే సైఫ్ అలీ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలయా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించింది. 2016 కన్నడ థ్రిల్లర్ మూవీ ‘U- టర్న్‌’లో నటిస్తున్నట్లు తెలిపింది. అరీఫ్ ఖాన్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా కల్ట్ మూవీస్ బ్యానర్‌పై ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ […]

Update: 2021-07-05 02:37 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్‌వాలా తన తొలి సినిమా ‘జవానీ జానేమన్’ సినిమాతో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే సైఫ్ అలీ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలయా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించింది. 2016 కన్నడ థ్రిల్లర్ మూవీ ‘U- టర్న్‌’లో నటిస్తున్నట్లు తెలిపింది. అరీఫ్ ఖాన్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా కల్ట్ మూవీస్ బ్యానర్‌పై ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నామని.. జూలై 6 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్.. ‘లైఫ్‌లో షార్ట్ కట్స్‌ లేనప్పుడు.. కొన్ని సార్లు మనం రూల్స్ బ్రేక్ చేసి U- టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అదే లైఫ్ జర్నీని పూర్తిగా మార్చేస్తుంది’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ ఇస్తుందని తెలిపారు.

Tags:    

Similar News