సినీ కార్మికులకు నాగ్ రూ. కోటి విరాళం

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున కరోనా ఎఫెక్ట్‌పై స్పందించారు. లాక్ డౌన్ సమయం నిజంగా కఠినమైనదని అభిప్రాయపడ్డారు. కానీ మనల్ని సురక్షితంగా ఉంచేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తోటి మిత్రులంతా సహాయం అందించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులను ఆదుకునేందుకు రూ. కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా విలయతాండవం చేస్తున్నా… దేవుడి మనల్ని ఆశీర్వదిస్తాడని… […]

Update: 2020-03-28 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున కరోనా ఎఫెక్ట్‌పై స్పందించారు. లాక్ డౌన్ సమయం నిజంగా కఠినమైనదని అభిప్రాయపడ్డారు. కానీ మనల్ని సురక్షితంగా ఉంచేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తోటి మిత్రులంతా సహాయం అందించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులను ఆదుకునేందుకు రూ. కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా విలయతాండవం చేస్తున్నా… దేవుడి మనల్ని ఆశీర్వదిస్తాడని… అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. కొంచెం టైం పట్టిందేమో కానీ…టైమింగ్ మాత్రం అదిరిపోయిందంటున్నారు. మీరు నిజంగా కింగ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Tags : Akkineni Nagarjuna, King, CoronaVirus, Covid 19

Tags:    

Similar News