జైలు నుంచి నేరుగా అసెంబ్లీకి..:AKHIL GOGOI
దిశ, వెబ్‌డెస్క్: దేశద్రోహంతోపాటు ఇతర అభియోగాలు ఎదుర్కొంటూ జైలు శిక్షను అనుభవిస్తున్న హక్కుల కార్యకర్త, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం జైలు నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. భారీ బందోబస్త్ మధ్య పోలీసులను ఆయనను అసోం అసెంబ్లీకి తీసుకెళ్లారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 126 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశద్రోహంతోపాటు ఇతర అభియోగాలు ఎదుర్కొంటూ జైలు శిక్షను అనుభవిస్తున్న హక్కుల కార్యకర్త, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం జైలు నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. భారీ బందోబస్త్ మధ్య పోలీసులను ఆయనను అసోం అసెంబ్లీకి తీసుకెళ్లారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 126 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి నేరుగా జైలు నుంచి అసెంబ్లీకి హాజరయ్యారు.
గొగోయ్‌ను 2019లో సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇతర అభియోగాల కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందాడు. కాగా, జైలులో ఉన్న అఖిల్‌ను ప్రమాణ స్వీకారం నిమిత్తం సభకు భద్రతా సిబ్బంది తీసుకువచ్చింది. అతను విలేకరులతో మాట్లాడకుండా సెక్యూరిటీ అడ్డుకుంది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే తన విధులనెలా నిర్వర్తించగలడని శిబ్‌సాగర్‌కు చెందిన ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.