ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా అజయ్ కుమార్‌ను నియమిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 20 నుంచి ఆయన బాధ్యతలు అమల్లోకి వచ్చినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త బాధ్యతలలో భాగంగా కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకం, కార్యాలయ విధులను ఆయన నిర్వర్తించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అజయ్ కుమార్ ఇదివరకు విదేశీ మారకం, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఆర్థిక, కరెన్సీ నిర్వహణ సహా వివిధ విభాగాల్లో సేవలందించారు. ఈడీగా పదోన్నతి […]

Update: 2021-08-26 06:06 GMT
rbi
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా అజయ్ కుమార్‌ను నియమిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 20 నుంచి ఆయన బాధ్యతలు అమల్లోకి వచ్చినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త బాధ్యతలలో భాగంగా కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకం, కార్యాలయ విధులను ఆయన నిర్వర్తించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అజయ్ కుమార్ ఇదివరకు విదేశీ మారకం, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఆర్థిక, కరెన్సీ నిర్వహణ సహా వివిధ విభాగాల్లో సేవలందించారు. ఈడీగా పదోన్నతి పొందడానికి ముందు అజయ్ కుమార్ ఆర్‌బీఐ న్యూఢిల్లీ రీజనల్ ఆఫీస్‌లో రీజనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేసిన అజయ్ కుమార్, ఐసీఎఫ్ఏఐ, బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్‌లలో ఎంఎస్ చేశారు. అలాగే, చికాగోలో ఉన్నటువంటి కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సహా ఇతర వృత్తి పరమైన బాధ్యతలను నిర్వహించారు.

Tags:    

Similar News