కరోనా కష్టంలో కస్టమర్లకు ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ మహమ్మారి కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గతవారం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రెండు కొత్త పథకాలను ప్రకటించగా, తాజాగా మరో దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సైతం తన కస్టమర్ల కోసం శుభవార్త ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ. 49 రీఛార్జ్ ప్యాక్‌ను ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం […]

Update: 2021-05-16 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ మహమ్మారి కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గతవారం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రెండు కొత్త పథకాలను ప్రకటించగా, తాజాగా మరో దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సైతం తన కస్టమర్ల కోసం శుభవార్త ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ. 49 రీఛార్జ్ ప్యాక్‌ను ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం వెల్లడించింది.

రూ. 49 ప్లాన్‌తో 100 ఎంబీ డేటాతో పాటు రూ. 38 టాక్‌టైం, 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుందని కంపెనీ వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తమ కస్టమర్లకు అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. దీంతో పాటు రూ. 79 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రెట్టింపు ప్రయోజనాలను పొందే వెసులుబాటు ఇస్తున్నట్టు, ఈ నిర్ణయం విలువ రూ. 270 కోట్లని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ల ప్రయోజనాలు రానున్న వారంలోగా ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News