గాల్లోకి ఎగిరి కూలింది: సీఐఎస్ఎఫ్ ఎస్‌ఐ
దిశ, వెబ్ డెస్క్: కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం లోయలోకి జారిపోలేదని, కొండ చివరి నుంచి మళ్లీ గాల్లోకి ఎగరడానికి యత్నించి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. తమ పోస్టుకు 15 అడుగుల దూరంలో రోడ్డుపై విమానం కూలిపోయిందని, కేవలం నాలుగు సెకన్లలోనే దుర్ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన రాత్రి ఆగస్టు 7న పెరిమీటర్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న అజిత్ సింగ్ ఘటనను కళ్లారా చూశారని […]
దిశ, వెబ్ డెస్క్: కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం లోయలోకి జారిపోలేదని, కొండ చివరి నుంచి మళ్లీ గాల్లోకి ఎగరడానికి యత్నించి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. తమ పోస్టుకు 15 అడుగుల దూరంలో రోడ్డుపై విమానం కూలిపోయిందని, కేవలం నాలుగు సెకన్లలోనే దుర్ఘటన జరిగిందన్నారు.
ప్రమాదం జరిగిన రాత్రి ఆగస్టు 7న పెరిమీటర్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న అజిత్ సింగ్ ఘటనను కళ్లారా చూశారని వివరించారు. ‘చిత్తడి వల్లనో, వర్షం కారణమో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లోయలోకి జారిపోలేదని, కొండ అంచు నుంచి మళ్లీ గాల్లోకి కొంత మేరకు ఎగిరింది. అనంతరం కూలిపోయింది. కేవలం నాలుగు క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిపోయింది. క్రాష్ అవ్వడానికి ముందు శబ్దాలు రాలేదు. కాక్‌పిట్ భాగం ఎయిర్‌పోర్ట్ బౌండరీ వాల్‌కు తాకింది. టర్మినల్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోగానే, శబ్దం దాటికి స్థానికులు రెండు నుంచి నాలుగు నిమిషాల్లోనే పోగయ్యారు. అందరూ రక్షణ చర్యల్లో మునిగిపోయారు’ అని ఆయన వివరించారు. ఒకవేళ విమానం లోయలోకి జారిపోయి ఉంటే కొండవాలులో శకలాలతోపాటు మృతదేహాలు ఉండేవని, కానీ అలా లేవని ఆయన పేర్కొన్నారు.