ఇండియా రానున్న ‘ఎయిర్ ఫోర్స్ వన్’..

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ప్రపంచంలోకెళ్లా అత్యంత భద్రతమైనదని అందరికీ తెలిసిందే. అలాంటి రెండు విమానాల తయారీకి గతంలోనే భారత్ బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఒక విమానం సిద్ధమవ్వగా మరోకటి చివరి దశలో తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వీటిని స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ (ఎస్‌ఈఎస్‌ఎఫ్) లేదా వీవీఐపీ విమానం ‘ఎయిర్ ఇండియా వన్’గా పిలుస్తారు. తయారుగా ఉన్న విమానాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ […]

Update: 2020-08-14 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ప్రపంచంలోకెళ్లా అత్యంత భద్రతమైనదని అందరికీ తెలిసిందే. అలాంటి రెండు విమానాల తయారీకి గతంలోనే భారత్ బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఒక విమానం సిద్ధమవ్వగా మరోకటి చివరి దశలో తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వీటిని స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ (ఎస్‌ఈఎస్‌ఎఫ్) లేదా వీవీఐపీ విమానం ‘ఎయిర్ ఇండియా వన్’గా పిలుస్తారు.

తయారుగా ఉన్న విమానాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ ఆఫీసర్లు, వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ ప్రభుత్వ అధికారుల సంయుక్త బృందం అమెరికాకు వెళుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాల సమాచారం. ఈ విమానాల్లో దేశంలోని అత్యంత ప్రముఖులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల కోసం మాత్రమే వినియోగించనున్నారు.

అమెరికా అధ్యక్షుడికి ఎలాంటి సెక్యూరిటీ కల్పించబడుతుందో ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ లో ఇండియా ప్రముఖులకు కూడా అంతే భద్రత కల్గిఉంటుంది. అయితే, రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉన్నది. దానికి అన్ని పరీక్షలు ఇప్పటికే నిర్వహించారు. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు కలిగిన ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానం ఏకధాటిగా 17 గంటలపాటు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో వీవీఐపీలు వాడుతున్న బీ-747 జంబో విమానాన్ని ఇది త్వరలోనే భర్తీ చేయనుందని ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News