బెంగాల్‌లోనూ పోటీకి దిగుతాం : ఓవైసీ

దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు AIMIM పార్టీ సిద్ధమైంది. బిహార్‌లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా ఐదు స్థానాల్లో విజయం దుందుబీ మోగించింది. ఇన్నిరోజులు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీ మొన్నటికీ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు స్థానాలను కైవనం చేసుకోగా, తాజాగా బిహార్‌లోనూ పాగా వేసింది. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న […]

Update: 2020-11-11 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు AIMIM పార్టీ సిద్ధమైంది. బిహార్‌లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా ఐదు స్థానాల్లో విజయం దుందుబీ మోగించింది. ఇన్నిరోజులు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీ మొన్నటికీ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు స్థానాలను కైవనం చేసుకోగా, తాజాగా బిహార్‌లోనూ పాగా వేసింది. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న వెస్ట్ బెంగాల్‌లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఎంఐఎం అధినేత ఓవైసీ తెలిపారు.

ఈ విషయమై బెంగాల్ ఎంఐఎం నాయకులతో త్వరలో సమావేశమై చర్చిస్తానని, వారు తమ సంసిద్ధతను కనబరిస్తే బెంగాల్లో పోటీ చేయడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లో 2021 ఏప్రిల్-మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పోటీ చేస్తే.. బెంగాల్ రాజకీయాలు పెను మార్పులు సంభవించవచ్చు. దేశంలోనే అధిక ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో బెంగాల్‌ది రెండోస్థానం. ఇన్నిరోజులు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. కానీ, గత సార్వత్రిక ఎన్నికల్లో 18ఎంపీ స్థానాలను బీజేపీ ఎగరేసుకుని పోయి తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చింది.

ఇప్పుడు అసదుద్దీన్ గనుక బెంగాల్ రాజకీయాల్లో ప్రవేశిస్తే ప్రధానంగా ముస్లిం ఓటర్లు చీలిపోయే అశకాశం లేకపోలేదు.దీంతో మరోసారి అధికారంలోకి రావాలన్న మమతా బెనర్జీ ఆశలకు గండి పడినట్లు అవుతుంది. అంతే కాకుండా సెక్యూలర్ జెండాను ఎత్తుకున్న కమ్యూనిస్టూ, కాంగ్రెస్ పార్టీలకు సైతం గట్టి దెబ్బ తాకనుంది. ఇప్పటివరకు బెంగాల్లో వామపక్ష, కాంగ్రెస్, తృణమూల్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. కానీ, రాబోయే ఎన్నికల్లో మమతబెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బిహార్‌లో తిరిగి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడంతో జోరుమీదున్న బీజేపీ బెంగాల్ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు భారీ తాయిలాలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఎత్తులను తిప్పికొట్టాల్సి ఉంటుంది.

 

 

Tags:    

Similar News