లవ్ జిహాద్ చట్టంపై విరుచుకు పడ్డ ఓవైసీ

దిశ,వెబ్ డెస్క్ : బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాంతాల్లో కొత్తగా తీసుకొస్తున్న లవ్ జిహాద్ చట్టాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో.. ఎవర్ని పెళ్లిచేసుకోకూడదో చెప్పే హక్కు బీజేపీ నేతలకు ఎవరిచ్చారని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు న్యాయం చేసే కనీస మద్దతు ధర చట్టం తేవాలని , నిరుద్యోగ భృతి చట్టం తీసుకొని రావాలని, ఉద్యోగుల తరుపు […]

Update: 2020-12-29 22:15 GMT

దిశ,వెబ్ డెస్క్ : బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాంతాల్లో కొత్తగా తీసుకొస్తున్న లవ్ జిహాద్ చట్టాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో.. ఎవర్ని పెళ్లిచేసుకోకూడదో చెప్పే హక్కు బీజేపీ నేతలకు ఎవరిచ్చారని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు న్యాయం చేసే కనీస మద్దతు ధర చట్టం తేవాలని , నిరుద్యోగ భృతి చట్టం తీసుకొని రావాలని, ఉద్యోగుల తరుపు ఓ బిల్లు తీసుకొని రావాలని ఓవైసీ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News