కేంద్ర ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలి
దిశ న్యూస్‌బ్యూరో: రైతాంగానికి నష్టం చేసే విధంగా కేంద్రమంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్‌లను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్త పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య పార్క్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో దేశ వ్యవసాయ మార్కెట్‌ను బహుళజాతి అగ్రో బిజినెస్ సంస్థలు, […]
దిశ న్యూస్‌బ్యూరో: రైతాంగానికి నష్టం చేసే విధంగా కేంద్రమంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్‌లను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్త పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య పార్క్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో దేశ వ్యవసాయ మార్కెట్‌ను బహుళజాతి అగ్రో బిజినెస్ సంస్థలు, దేశీయ కార్పొరేట్లు ఆక్రమించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.