కమీషన్ల కక్కుర్తికి కేఎల్ఐ నిదర్శనం -వంశీచంద్

దిశ, తెలంగాణ బ్యూరో : కల్వకుర్తి పంప్ హౌజ్ నీటిలో మునగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఇంకా నిర్మాణాలుపూర్తి కాకుండానే పంప్ హౌజ్‌కు పగుళ్లు రావడం ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమన్నారు. దీనిపై 2016లో శాసనసభలో ఆధారాలతో చూపించామని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల లాభం కోసమే పాలమూరు-రంగారెడ్డి ఉపరితల పంప్ హౌజ్‌ను భూగర్భ పంప్ హౌజ్‌గా మార్చారని, రైతుల సంక్షేమం కన్నా కమీషన్లపైనే సీఎం […]

Update: 2020-10-16 12:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కల్వకుర్తి పంప్ హౌజ్ నీటిలో మునగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఇంకా నిర్మాణాలుపూర్తి కాకుండానే పంప్ హౌజ్‌కు పగుళ్లు రావడం ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమన్నారు.

దీనిపై 2016లో శాసనసభలో ఆధారాలతో చూపించామని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల లాభం కోసమే పాలమూరు-రంగారెడ్డి ఉపరితల పంప్ హౌజ్‌ను భూగర్భ పంప్ హౌజ్‌గా మార్చారని, రైతుల సంక్షేమం కన్నా కమీషన్లపైనే సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రేమ ఉందని మండిపడ్డారు.

Tags:    

Similar News