సీఎం కేసీఆర్ అధికార ఛాందసవాదిగా మారారు

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ అధికార ఛాందసవాదిగా మారి దేవాలయాలు, మసీదులు కూల్చేస్థాయికి దిగజారారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ఇటువంటి ఛాందసవాదులకు దేవుడు పెట్టిన శాపం ఘటనలను ఉదహరించారు. అపర కుబేరుడు, కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి ఓబుళాపురం గనులలో ఉన్న ఇనుప ఖనిజాన్ని దోచుకునే దుర్భుద్ధితో సుంకులమ్మ దేవాలయాన్నికూల్చి దేవత శాపానికి గురై, బంగారు పళ్లెంలో తినేవాడు చిప్పకూడు తినాల్సిన పరిస్థితికి చేరుకున్నారన్నారు. ఇదే తరహాలో ఇప్పుడు కేసీఆర్ కేవలం తన కొడుకు […]

Update: 2020-07-11 05:24 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ అధికార ఛాందసవాదిగా మారి దేవాలయాలు, మసీదులు కూల్చేస్థాయికి దిగజారారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ఇటువంటి ఛాందసవాదులకు దేవుడు పెట్టిన శాపం ఘటనలను ఉదహరించారు. అపర కుబేరుడు, కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి ఓబుళాపురం గనులలో ఉన్న ఇనుప ఖనిజాన్ని దోచుకునే దుర్భుద్ధితో సుంకులమ్మ దేవాలయాన్నికూల్చి దేవత శాపానికి గురై, బంగారు పళ్లెంలో తినేవాడు చిప్పకూడు తినాల్సిన పరిస్థితికి చేరుకున్నారన్నారు. ఇదే తరహాలో ఇప్పుడు కేసీఆర్ కేవలం తన కొడుకు సీఎం కావాలనుకుంటున్నారని, గత 16మంది సీఎంల కొడుకులెవ్వరూ ముఖ్యమంత్రులు కాలేదని, దానికి సెక్రెటేరియట్ వాస్తు బాగోలేదని సరిచేసేందుకే సెక్రెటేరియేట్ ప్రాంగణంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయాన్ని కూల్చారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్, మిషన్ భగీరథ పేరిట లూటీ చేసిన వేలకోట్ల రూపాయల బండారం అమ్మవారే బయటపెడతారని అన్నారు.

Tags:    

Similar News