నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేకపోవడంతో కడ్తాల్ గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ నాగులు రవీంద్రభారతి దగ్గర గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల పరిస్థితికి నాగులు వ్యవహారం అద్దం పడుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. లాక్‌డౌన్ ప్రారంభం […]

Update: 2020-09-10 07:08 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేకపోవడంతో కడ్తాల్ గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ నాగులు రవీంద్రభారతి దగ్గర గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల పరిస్థితికి నాగులు వ్యవహారం అద్దం పడుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి జీతాలు లేక ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు పస్తుంలుంటున్నారన్నారు. ఎన్ని విన్నపాలు, డిమాండ్లు పెట్టినా, ఉద్యమాలు నడిపినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.

Tags:    

Similar News