63 శాతం అడిగితే 7.5 శాతం ఇస్తారా?

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఉద్యోగులు 63 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 7.5 శాతం ఇస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తొలి పీఆర్సీ రిపోర్టు ఉద్యోగుల కడుపు నింపడం కాదు.. పొట్ట గొడుతుందని విమర్శించారు. ఉద్యోగులు ఆశించిన కనీస వేతనం రూ.25,000 కాకుండా కేవలం రూ.19,000 సూచించడం అన్యాయమన్నారు. ఉచిత EHS అని చెప్పి ఇప్పుడు జీతంలో నుంచి ఒక శాతం కొత విధించడం సరి కాదన్నారు చల్లా […]

Update: 2021-01-27 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఉద్యోగులు 63 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 7.5 శాతం ఇస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తొలి పీఆర్సీ రిపోర్టు ఉద్యోగుల కడుపు నింపడం కాదు.. పొట్ట గొడుతుందని విమర్శించారు. ఉద్యోగులు ఆశించిన కనీస వేతనం రూ.25,000 కాకుండా కేవలం రూ.19,000 సూచించడం అన్యాయమన్నారు.

ఉచిత EHS అని చెప్పి ఇప్పుడు జీతంలో నుంచి ఒక శాతం కొత విధించడం సరి కాదన్నారు చల్లా వంశీచంద్ రెడ్డి. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, సీపీఎస్ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధమేనని వంశీచంద్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News