IPL : అహ్మదాబాద్ జట్టు కోచ్‌గా రవి శాస్త్రి..? భారీ మొత్తంలో ఆఫర్ చేసిన ఫ్రాంచైజీ
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది ఐపీఎల్ -2022లో సీజన్‌లో రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. అయితే, అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి రవిశాస్త్రి కోచ్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం ఆయన టీం ఇండియా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి విరమణ పొందనున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే రవి శాస్త్రిని సంప్రదించి భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శాస్త్రితో పాటు టీమిండియాకు బౌలింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది ఐపీఎల్ -2022లో సీజన్‌లో రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. అయితే, అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి రవిశాస్త్రి కోచ్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం ఆయన టీం ఇండియా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి విరమణ పొందనున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే రవి శాస్త్రిని సంప్రదించి భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
శాస్త్రితో పాటు టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌లకు కూడా IPLలో భారీ డిమాండ్ ఏర్పడింది. కాగా, దీనిపై రవి శాస్త్రి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. UAE నుంచి తిరిగొచ్చిన తర్వాత రవి శాస్త్రి ఈ ఆఫర్‌పై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.