హైకోర్టుకు అగ్రిగోల్డ్ కేసు
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. గతంలో ఈ కేసును విచారించేందుకు ధర్మాసనం అంగీకరించకపోవడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిట్ దారులకు పంపిణీ చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ల ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యుడు ఆండాల్ రమేశ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసు విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల బెంచ్ హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. గతంలో ఈ కేసును విచారించేందుకు ధర్మాసనం అంగీకరించకపోవడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిట్ దారులకు పంపిణీ చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ల ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యుడు ఆండాల్ రమేశ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసు విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల బెంచ్ హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం ఆదేశాలతో హైకోర్టు సోమవారం నుంచి విచారణ చేయనుంది.