Murra buffalo: ఈ జాతి గేదెను పెంచితే.. రోజుకి ఎంత మిగులుతాయంటే?

ఈ జాతి గేదెను పెంచితే.. రోజుకి ఎంత మిగులుతాయంటే

Update: 2024-08-31 05:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రైతులు చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఈ మధ్య కొందరు  పశువుల పెంపకం పైనా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, దీని గురించి సరైన అవగాహన ఉంటే.. డబ్బు బాగా సంపాదించవచ్చు.

ఇప్పుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు జాబ్స్ వదిలేసి బిజినెస్ వైపు వెళ్తున్నారు. విద్యావంతులైన యువత కూడా ఎవరికివారు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గేదెల పెంపకం గురించి తెలియక చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన జాతి గేదే గురించి ఇక్కడ చూద్దాం.. దీని ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. ముర్రా జాతి గేదె గురించి మీరు వినే ఉంటారు.

ఈ జాతి గేదెలను ఇతర గేదెలతో పోలిస్తే కాస్తా వేరు అనే చెప్పుకోవాలి. ఇది వరల్డ్ లోనే అతిపెద్ద పాలు ఇచ్చే గేదెగా చెబుతుంటారు.  దీని పాల ద్వారా రోజుకి రూ.2వేల వరకూ సంపాదించ వచ్చని చెబుతున్నారు. ఇదే కాకుండా ఇది గెత్తానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మొత్తం ఖర్చులకి పోనూ రోజుకి రూ. 1500 వరకు లాభం వస్తుందని గేదెల వ్యాపారులు చెబుతున్నారు.

Tags:    

Similar News