కొత్త చిక్కుల్లో ‘అగ్రికల్చర్ ఆఫీసర్లు’.. కేసీఆర్ ప్రకటనే కారణామా..?
దిశ, తెలంగాణ బ్యూరో : ఇకపై వరి పంట సాగు రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతులతో పాటు అధికారులకూ కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. వరి వేయొద్దని సీఎం ఎలా ప్రకటిస్తారంటూ రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఉన్నట్టుండి ఇలా వరి పంటను ఆపేయాలంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే నీటి లభ్యత పెరిగిందని, ఇది వరి పంట ఉత్పత్తికి అనుకూలమని రైతులు చెబుతున్నారు. తక్కువ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఇకపై వరి పంట సాగు రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతులతో పాటు అధికారులకూ కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. వరి వేయొద్దని సీఎం ఎలా ప్రకటిస్తారంటూ రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఉన్నట్టుండి ఇలా వరి పంటను ఆపేయాలంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే నీటి లభ్యత పెరిగిందని, ఇది వరి పంట ఉత్పత్తికి అనుకూలమని రైతులు చెబుతున్నారు. తక్కువ శ్రమ, సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉన్నట్టు వివరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులంతా షాక్‌లో ఉన్నట్టు ఓ రైతు నాయకుడు చెప్పారు. తమ సమస్యలను ప్రభుత్వానికి వివరించాలని ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. కొన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలను కూడా ఇచ్చామన్నారు. ప్రభుత్వం తీసుకున్న అకస్మిక నిర్ణయంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటు రైతులను ఇబ్బంది పెట్టలేక, అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక అంతర్గతంగా మదనపడుతున్నట్టు వ్యవసాయ శాఖలోని ఓ ముఖ్య అధికారి ‘దిశ’కు చెప్పారు.
4 రెట్లు పెరిగిన వరి..
స్వరాష్ర్టం ఏర్పడిన మొదటి సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం వరి ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన మొదటి ఏడాదిలో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి రాగా, 2020–21 నాటికి 255.81 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే ఆరేండ్లలో నాలుగు రెట్లు అధికమైనది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 54.87 లక్షల ఎకరాల్లో వరి సాగైనది. ఇందులో 27.98 లక్షల ఎకరాల్లో సన్న బియ్యం వేయగా, దొడ్డు రకం 26.89 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దీంతో ఈ సారి కోటి 37 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు విస్తారంగా కురవడం, భూగర్భ జలాలు పెరగడం, 24 గంటల కరెంట్ వంటి అంశాలతోనే ఉత్పత్తి భారీగా పెరిగిందంటున్నారు. అంతేగాక ఇతర పంటలతో పోల్చితే వరి పంటను పండించడంలో తక్కువ పని ఉంటుందని స్పష్టం చేశారు. దీంతోనే రాష్ర్ట వ్యాప్తంగా వరి పంట సాగు భారీ స్థాయిలో జరిగిందని అధికారులు అంటున్నారు. మరోవైపు వరిని ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సీఎం గతంలో చేసిన వ్యాఖ్యలను ఎంతో మంది రైతులు ప్రేరణగా తీసుకున్నారు. దీంతో వరి పంట సాగు విపరీతంగా పెరిగింది. కానీ, ప్రస్తుతం ఇదే రైతులను ఇబ్బంది పెడుతున్నది. సడన్ గా సర్కార్ తీసుకున్న వరి పంట బంద్ నిర్ణయం రైతులకు శాపంగా మారబోతున్నది.
బ్యూరో క్రాట్‌లు ఏం చేస్తున్నారు?
సర్కార్ తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. వరిని పండించొద్దని చెబుతున్న అధికారులు ప్రత్యమ్నాయ పంటలపై ఎందుకు అవగాహన కల్పించలేకపోయారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నందున వరి ఉత్పత్తి భారీ స్థాయిలో ఉంటుందని మూడేళ్ల కిందనే అధికారులకు అవగాహన ఉంటుంది కదా..? అని అడుగుతున్నారు. కానీ, కనీసం ఒక్క అధికారి కూడా ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించలేకపోయారా..? అని రైతులు మండిపడుతున్నారు. లక్షల జీతాలు తీసుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టడం ఏమిటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యసాధ్యాలపై ప్రభుత్వానికి వివరించాల్సిన బాధ్యత బ్యూరో క్రాట్ లపై ఉంటుంది కదా? అని గుర్తుచేస్తున్నారు. రైతుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేకత వస్తున్నందున ఇప్పుడు వ్యవసాయ శాఖలో వరి పంట సాగు బంద్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.