యువతి, ఇద్దరు యువకులు అర్ధరాత్రి పాడుపని.. బుల్లెట్ బండిపైనే..

దిశ, కూకట్‌పల్లి: చదువుకుంది అగ్రికల్చర్​ఇంజనీరింగ్..​ చేస్తుంది మాత్రం గంజాయి సరఫరా.. ఆంధ్రప్రదేశ్‌లోని ​భీమవరం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్​ ఏకంగా బుల్లెట్ బండిపై అర్ధరాత్రి నగరంలో చక్కర్లు కొడుతూ గంజాయిని సరఫరా చేస్తు ఎక్సైజ్​ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. బుల్లెట్​బండిపై గంజాయి సరఫరా చేస్తున్న యువతీయువకుడిని బాలానగర్ ఎక్సైజ్​పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, బుల్లెట్​బండి, మూడు సెల్​ఫోన్లు, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ […]

Update: 2021-10-30 12:08 GMT

దిశ, కూకట్‌పల్లి: చదువుకుంది అగ్రికల్చర్​ఇంజనీరింగ్..​ చేస్తుంది మాత్రం గంజాయి సరఫరా.. ఆంధ్రప్రదేశ్‌లోని ​భీమవరం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్​ ఏకంగా బుల్లెట్ బండిపై అర్ధరాత్రి నగరంలో చక్కర్లు కొడుతూ గంజాయిని సరఫరా చేస్తు ఎక్సైజ్​ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. బుల్లెట్​బండిపై గంజాయి సరఫరా చేస్తున్న యువతీయువకుడిని బాలానగర్ ఎక్సైజ్​పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, బుల్లెట్​బండి, మూడు సెల్​ఫోన్లు, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ జీవన్​కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..

భీమవరానికి చెందిన సాయి తేజ(24), శృతి(23), సంజయ్​స్నేహితులు. రాజమండ్రిలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్​ కళాశాలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్​పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. కూకట్ పల్లిలోని గోకుల్​ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. సంజయ్ రెండు నెలులుగా సాయితేజ, శృతికి గంజాయిని సరఫరా చేస్తున్నాడు. వీరిద్దరు అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో గోకుల్ ప్లాట్స్‌లో గంజాయి సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఎక్సైజ్ పోలీసులు కూకట్ పల్లి తనిఖీలు చేయగా.. బుల్లెట్ బండిపై గంజాయి విక్రయిస్తూ సాయితేజ, శృతి పట్టుబడ్డారు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తమకు రెండు నెలలుగా సాయికృష్ణ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు అంగీకరించారు. వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఏపీ 37 ఏటీ 8666 నంబరు గల రాయల్​ఇన్​ఫీల్డ్, మూడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్​టాప్​స్వాధీనం చేసుకున్నట్టు జీవన్​కిరణ్ తెలిపారు. దాడులలో ఎక్సైజ్​ఎస్సైలు శ్యాంసుందర్, జశ్వంత్ నాయుడు, మహేందర్​రెడ్డి, సిబ్బంది వి.శ్రీనివాస్, సురేందర్, బాలరాజ్, రాంచందర్, పద్మ, శ్రీనివాస్, శ్యాంసుందర్, భార్గవిలు పాల్గొన్నారు.

Tags:    

Similar News