కర్ణాటక బ్యాంక్‌తో ఒప్పందం.. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM)
దిశ, వెబ్‌డెస్క్ : టయోటా మోటార్ కార్పొరేషన్, కిర్లోస్కర్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయినటువంటి టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశంలోని నగరాలు, పట్టణాల్లో తమ వాహనాలకు ఫైనాన్స్ చేయడానికి కర్ణాటక బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రైవేట్, వాణిజ్య ఉపయోగాల కోసం టయోటా వాహనాలను కొనుగోలు చేయడానికి, ప్రాధాన్యత రంగ పథకాలలో వినియోగదారులకు సులభమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ ఎంపికల కోసం కర్ణాటక బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : టయోటా మోటార్ కార్పొరేషన్, కిర్లోస్కర్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయినటువంటి టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశంలోని నగరాలు, పట్టణాల్లో తమ వాహనాలకు ఫైనాన్స్ చేయడానికి కర్ణాటక బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రైవేట్, వాణిజ్య ఉపయోగాల కోసం టయోటా వాహనాలను కొనుగోలు చేయడానికి, ప్రాధాన్యత రంగ పథకాలలో వినియోగదారులకు సులభమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ ఎంపికల కోసం కర్ణాటక బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.
కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ మహాబలేశ్వర M.S. మాట్లాడుతూ, “ మా కస్టమర్‌లకు ఉత్తమమైన సేవలను అందించడానికి కర్ణాటక బ్యాంక్, టయోటా కిర్లోస్కర్ మోటార్ రెండు సంస్థలు కలిసి వినియోగదారులకు మంచి సేవలను అందిస్తాయని తెలిపారు.