వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగానికి ఒప్పందం
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తగిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతిష్ట ఇండస్ట్రీస్‌తో బుధవారం అవగాన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు సమక్షంలో రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ప్రతిష్టా ఇండస్ట్రీ ఎండి ఎం.వి.ఎస్.ఎస్ సాయిరాంలు సంతకాలు చేశారు. సుస్థిర పంటల యాజమాన్యం కోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించడంపై ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్బంగా వీసి ప్రవీణ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తగిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతిష్ట ఇండస్ట్రీస్‌తో బుధవారం అవగాన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు సమక్షంలో రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ప్రతిష్టా ఇండస్ట్రీ ఎండి ఎం.వి.ఎస్.ఎస్ సాయిరాంలు సంతకాలు చేశారు. సుస్థిర పంటల యాజమాన్యం కోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించడంపై ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.
ఈ సందర్బంగా వీసి ప్రవీణ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నీటిలభ్యత పెరగడంతో పంటల ఉత్పాధకత 300శాతం పెరిగిందని తెలిపారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించేందుకు వివిధ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాల వలన ఆయా సంస్థలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రతిష్టా ఇండస్ట్రీతో పాటు ముంబయికి చెందిన యాంకర్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ తోనూ వ్యవసాయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించారు. మినరల్ ఫర్టిలైజర్ వినియోగంపై అధ్యాయనాలు చేస్తున్నట్టుగా తెలిపారు.