దూకుడు పెంచిన షర్మిల.. పార్టీ నిర్మాణంపై ఫోకస్

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో రాజ‌న్న రాజ్యస్థాప‌నే లక్ష్యంగా పార్టీ పెట్టిన షర్మిల ‌పార్టీ నిర్మాణం పై ఫోకస్ పెట్టారు. వైస్సార్ టీపీలో క‌మిటీల‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం జంబో కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనుంది. పాద‌యాత్ర చేసేలోపు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు చేరువ కావాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీని గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, […]

Update: 2021-07-17 19:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో రాజ‌న్న రాజ్యస్థాప‌నే లక్ష్యంగా పార్టీ పెట్టిన షర్మిల ‌పార్టీ నిర్మాణం పై ఫోకస్ పెట్టారు. వైస్సార్ టీపీలో క‌మిటీల‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం జంబో కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనుంది. పాద‌యాత్ర చేసేలోపు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు చేరువ కావాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీని గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు.

ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం వహించేలా ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి వింగ్ లోనూ 33 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లు తెలస్తోంది. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వ‌ర‌కు క‌మిటీల ఏర్పాటుకు పార్టీ బైలాస్‌ను రూప‌క‌ల్పన చేసుకుంటున్నారు వైస్సార్ టీపీ అధినేత్రి షర్మిల‌.

జిల్లాస్థాయి కమిటీలో 100 మంది

గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు శాశ్వత క‌మిటీలను ష‌ర్మిల త్వరలో ఏర్పాటు చేయ‌బోతున్నారు. జిల్లా స్థాయిలో అధ్యక్ష ప‌ద‌వితో పాటు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఇలా 100 మంది ఉండేలా క‌మిటీ నిర్మాణం చేప‌ట్టనున్నారు. మండ‌ల స్ధాయిలో అధ్యక్ష ప‌ద‌వితో పాటు మ‌రో 40 మందితో కూడిన క‌మిటీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామీణ‌స్థాయిలో అధ్యక్ష ప‌ద‌వితో పాటు 15 మంది కార్యవర్గం ఉండేలా రూప‌కల్పన జ‌రుగుతోంది. జిల్లా స్థాయి క‌మిటీ.. జిల్లాలోని మండలాలు, గ్రామ క‌మిటీల ప‌నితీరును ప్రతి రెండు నెల‌ల‌కోసారి స‌మీక్ష చేసుకునేలా షర్మిల ప్రణాళికలు రచించారు. పార్టీ గీత దాటితే చ‌ర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలోనే వైఎస్సార్ టీపీకి క్రమశిక్షణ క‌మిటీల‌ను సైతం షర్మిల ఏర్పాటు చేయనుంది. జిల్లాలోనే ముగ్గురు సీనియ‌ర్ నాయ‌కుల‌ను ఈ క్రమశిక్షణ కమిటీకి షర్మిల కేటాయించనున్నారు.

అనుబంధ కమిటీలు సైతం..

జిల్లా, మండ‌ల‌, గ్రామీణ స్థాయి క‌మిటీల‌కు అనుబంధంగా మ‌రో 14 క‌మిటీల నిర్మాణాన్ని సైతం వైఎస్సార్ టీపీకి షర్మిల ఏర్పాటు చేసుకోబోతున్నారు. విద్యార్థి విభాగం, రైతు, మ‌హిళా, ట్రేడ్ యూనియ‌న్స్, బీసీ, ఎస్సీ, మైనార్టీ, యువ‌జ‌న విభాగం, లీగల్, ఉపాధ్యాయ సంఘాల లాంటి అనుబంధ క‌మిటీలను సైతం షర్మిల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుబంధ క‌మిటీలు మొత్తం 45 మంది స‌భ్యులు ఉండేలా పార్టీ విధివిధానాలు ఉండేలా ష‌ర్మిల రూపకల్పన చేయ‌బోతున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 10వ తేదీలోపు క‌మిటీలు వేసి న‌వంబ‌ర్ 20 నాటికి నియామ‌కప‌త్రాలు అందించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ష‌ర్మిల అమ‌లు చేయ‌బోతున్నారు.

ఇదిలా ఉండగా వైఎస్సార్ టీపీలో అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌ ప్రాధాన్యత ఉంటుంద‌ని ఇప్పటికే ప్రకటించిన ష‌ర్మిల‌ క‌మిటీల నిర్మాణంలో రిజ‌ర్వేష‌న్లను అమ‌లుచేస్తోంది. ప్రతి కమిటీలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌డంతో పాటు, మొత్తంగా 33 శాతం మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించేలా క‌మిటీ నిర్మాణం ఉండాల‌ని షర్మిల నిర్ణయించారు.

ఈ మంగళవారం నిరాహార దీక్ష ఖమ్మం జిల్లాలో..

ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు పూనుకున్న షర్మిల ఈనెల 20 తేదీన గంగదేవిపాడు గ్రామానికి వెళ్లనున్నారు. నోటిఫికేషన్లు లేక ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, గంగదేవిపాడు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు. అక్కడే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రి 6 గంటల వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

Tags:    

Similar News