కిలాడీ కవల కాకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
దిశ,వెబ్‌డెస్క్ : ఏంటీ కాకి గోలా అని అందరూ అంటూ ఉంటారు మాములుగా.. కానీ అవి నిజంగానే గోల చేస్తుంటాయా ? అయితే యూకేలో మాత్రం ఓ రెండు కాకులను భరిచడం అక్కడి ప్రజల వల్ల అవ్వడం లేదు. ఏంటీ కాకులను భరిచడం అవి మనుషుల జోలికి రావుగా అనుకుంటున్నారా.. అయితే అవి వచ్చేవి మనుషుల జోలికి కాదు, కార్ల జోలికి, కార్ల జోలికి కాకులు రావడం ఏంటీ అనేగా మీ ఆలోచన.. మీరే చదవండి ఈ […]
దిశ,వెబ్‌డెస్క్ : ఏంటీ కాకి గోలా అని అందరూ అంటూ ఉంటారు మాములుగా.. కానీ అవి నిజంగానే గోల చేస్తుంటాయా ? అయితే యూకేలో మాత్రం ఓ రెండు కాకులను భరిచడం అక్కడి ప్రజల వల్ల అవ్వడం లేదు. ఏంటీ కాకులను భరిచడం అవి మనుషుల జోలికి రావుగా అనుకుంటున్నారా.. అయితే అవి వచ్చేవి మనుషుల జోలికి కాదు, కార్ల జోలికి, కార్ల జోలికి కాకులు రావడం ఏంటీ అనేగా మీ ఆలోచన.. మీరే చదవండి ఈ కాకుల గోల గురించి.
యూకేలో కార్లిస్లే అవెన్యూ, లిటిల్ఓవర్ ప్రాతం ఉంది. అయితే అక్కడి ప్రజలు లిటిఓవర్ ప్రాంతంలో కార్లపార్క్ చేస్తుంటారు. అలా కార్లు పార్క్ చేసి ఇంటికి వెళ్లి మళ్లీ రిటన్ వచ్చే సరికి కారు అద్దాలు పలిగిపోవడం, కారుపై గీతాలు పడటం, కారులోని విలువైన వస్తువులు మాయమవడంతో కారు యజమానులు ఆందోళనకు గరయ్యారు. అసలేం జరుగుతుంది..? మా కార్లను ఎవరో దుండగులు కావాలనే పాడు చేస్తున్నారని భావించిన యజమానులు, ఓ వ్యక్తిని కాపలాదారునిగా పెట్టారు. దీంతో వారికి షాకింగ్ విషయం తెలిసింది. అయితే రోజు ఈ కార్ల అద్దాలు పగలగొట్టడం, గీతలు గీయడం లాంటి పనులు చేస్తున్నవి దుండగులు కాదు, కాకులు ఈ పనులన్ని చేస్తున్నాయని. దీంతో వారు లైట్ తీసుకున్నారు. కాకులేగా ఏం ఉంది ‘షో’ అంటే పోతాయి మళ్లీ రావు అని.. కానీ ఆ కాకులు కిలాడీ కాకులని తెలియదు పాపం. అందుకే కారు యజమానులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాగించేసాయి.
వీరు వాటిని వెళ్లగొట్టినా అవి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వచ్చి కార్లను పాడు చేసేవి. దీంతో వీటి బాధ నుంచి తప్పించుకోవాలని యజమానులు దిష్టిబొమ్మలను పెట్టారు, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఈ కాకుల గోల గురించి తేలికగా తీసుకున్న పోలీసులు ఫిర్యాధులు అధికం అవడంతో పోలీసులు రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికార ప్రతినిధికి పరిస్థితి గురించి వివరించారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..విండ్‌స్క్రీన్‌లో కాకులు తమని తాము చూసుకుని వేరే పక్షులు వచ్చాయని భావిస్తున్నాయి కాబోలు. అందుకే అవి వాటిని ముక్కుతో పొడిచి చంపే ప్రయత్నంలో విండ్‌స్క్రీన్లను పగలగొడుతున్నాయి’’ అని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కారు యజమానులు కార్లకు కవర్ లాంటి కప్పడం మొదలు పెట్టారు. ఇలా అయినా ఈ సమస్య తీరిపోతుందని వారు చాలా ఆశపడ్డారు. కానీ వారి ఆలోచనకు ఆ రెండు కాకులు తింప్పి కొట్టాయి. కార్లపై కవర్ కప్పినా.. వాటిపై తన ప్రతిబిభం కనిపించకపోయినా అవి చేసే పని అవి చేస్తూనే ఉన్నాయి. దీంతో విసుగచ్చిన అక్కడి ప్రజలు వాటిని మచ్చిక చేసుకునే పనిలో మునిగి పోయారు. అయితే ఈ రెండు కాకులు తూర్పు లండన్‌లో 50-60 దశకాల్లో పేరొందిన అండర్ వరల్డ్ కవల సోదరులు రోనీ, రెగీ పేర్లను పెట్టారు. ప్రస్తుతం వీటి గోలా యూకే ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది.