రెండు పెళ్లిళ్లు.. ఒకే అనుకోని అతిధి.. కట్ చేస్తే

దిశ, వెబ్ డెస్క్: అదో కల్యాణ మండపం… వధూవరులు ఇద్దరు వేదికపై చూడముచ్చటగా ఉన్నారు. ఇక బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపం కళకళలాడుతుంది. ఇంతలో ఒక అనుకోని అతిధి అక్కడికి వచ్చారు. ఆయనను చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. వధూవరుల దగ్గరకు వెళ్లి వారికి విషెస్ చెప్తారు అనుకొంటే వారిపై కేసు బుక్ చేసి కటకటాల లోపలికి పంపారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటి? అక్కడకు వచ్చిన అనుకోని అతిధి ఎవరు అంటే.. మొత్తం […]

Update: 2021-04-28 02:37 GMT

దిశ, వెబ్ డెస్క్: అదో కల్యాణ మండపం… వధూవరులు ఇద్దరు వేదికపై చూడముచ్చటగా ఉన్నారు. ఇక బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపం కళకళలాడుతుంది. ఇంతలో ఒక అనుకోని అతిధి అక్కడికి వచ్చారు. ఆయనను చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. వధూవరుల దగ్గరకు వెళ్లి వారికి విషెస్ చెప్తారు అనుకొంటే వారిపై కేసు బుక్ చేసి కటకటాల లోపలికి పంపారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటి? అక్కడకు వచ్చిన అనుకోని అతిధి ఎవరు అంటే.. మొత్తం వివరాలు తెలుసుకోవాల్సిందే.

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే.. కొంతమంది విలాసాలు చేసుకొంటున్నారు. విందులు, వినోదాలు అంటూ అందర్నీ పిలిచి పెళ్లి వేడుకులను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ వేడుకలను కట్టడి చేయడానికి అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒకచోట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వీటిపై వెస్ట్ త్రిపుర మేజిస్ట్రేట్ శైలేష్ యాదవ్ అనే ఐఏఎస్ నిఘా వేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం రెండు కల్యాణమండపంలో పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్నారు. మొదట అందరిలానే అతిథిలా పెళ్ళికి వెళ్లారు. అక్కడ చాలా మంది మాస్క్ లు పెట్టుకోకుండా తిరగడం, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నడుచుకోవడం లాంటివి చూసి వారిపై విరుచుకుపడ్డారు.

నేరుగా వధూవరుల వద్దకు వెళ్లి వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మాస్క్ పెట్టుకోనివారిపై చేయిచేసుకున్నారు. పెళ్ళికి అనుమతించిన రెండు కళ్యాణమండపాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే కలెక్టర్ తీరుపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కలెక్టర్ అయితే మాత్రం సామాన్య ప్రజలపై చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News