మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగాలకే కేసీఆర్ మొగ్గు.. నోటిఫికేషన్ విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగాలపై మొగ్గు చూపింది. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలు ఉండబోవని గతంలో అనేక మార్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట తప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి రాబోతున్న 8 మెడికల్‌కాలేజీలకు కాంట్రాక్ట్విధానంలో తాత్కాలికంగా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ప్రొఫెసర్లను ఏడాది కాలం గడువుతో నియమించనుంది. వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగాలపై మొగ్గు చూపింది. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలు ఉండబోవని గతంలో అనేక మార్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట తప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి రాబోతున్న 8 మెడికల్‌కాలేజీలకు కాంట్రాక్ట్విధానంలో తాత్కాలికంగా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ప్రొఫెసర్లను ఏడాది కాలం గడువుతో నియమించనుంది.
వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీల్లో 15 విభాగాలకు నియామకాలనుచేపట్టనుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్డాక్టర్ రమేష్‌రెడ్డి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారు ఈ నెల 28వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 31వ తేది ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని, వచ్చే నెల 7వ తేది వరకు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, మళ్లీ టెంపరరీని తెరమీదకు తేవడం ఏందని పలువురు ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాత్కాలిక విధానంలో పనిచేసేందుకు ప్రొఫెసర్లు ఆసక్తి చూపే అవకాశం చాలా తక్కువేనని స్వయంగా ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లోని ప్రొఫెసర్లు చెబుతున్నారు. అయితే రెగ్యూలర్ భర్తీ తర్వాత ఇప్పుడు నియమించిన వారికి నెల ముందు నోటీసులిచ్చి తొలగిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అంటే ఇప్పుడిచ్చే ఉద్యోగాలకు భరోసా లేదనేది స్వయంగా ప్రభుత్వమే నోటిఫికేషన్‌లో నొక్కి చెప్పింది.
ప్రతీ కాలేజీలో 15 విభాగాలు..
ఒక్కో మెడికల్ కాలేజీలో 15 విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ర్టీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెనిక్స్మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైక్రియాటరీ, ఆర్థోఫెడిక్, అనస్థీయాలజీ, రేడియోడయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్విభాగాల్లో నియమాలను చేపట్టనున్నారు. అయితే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ర్టీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌లకు ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ప్రొఫెసర్లను భర్తీ చేస్తుండగా, ఫోరెనిక్స్ మెడిసిన్‌కు ప్రొఫెసర్, అసోసియేట్ప్రొఫెసర్లను నియమించనున్నారు. ఇక జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైక్రియాటరీ, ఆర్థోఫెడిక్, అనస్థీషియాలజీ, రేడియోడయాగ్నోసిస్ విభాగాలకు అసొసియేట్ ప్రొఫెసర్లు, ఎమర్జెన్సీ మెడిసిన్‌కు అసోసియేట్, అసిస్టెంగ్ప్రొఫెసర్లను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగానికి అర్హతలు ఇవే..
ఏదేని ఒక విభాగంలో ఎండీ, ఎంఎస్‌పూర్తి చేసి మెడికల్కౌన్సిల్ఆఫ్ఇండియాలో నమోదై 1998 నుంచి బోధన కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. అంతేగాక మూడు సంవత్సరాలు పాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఒక సబ్జెక్ట్‌ను బోధిస్తూ ఉండాలి. అంతేగాక నాలుగు పరిశోధనలు జర్నల్స్ లో ప్రచురితం కావాలి. కనీసం రెండు పబ్లిష్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో కచ్చితంగా ఎంబీబీఎస్‌తో పాటు అదనపు క్వాలిఫికేషన్‌ను రిజిస్ర్టర్ చేసుకోవాలి. ఇక అసోసియేట్, అసిస్టెంట్ప్రొఫెసర్లకు అకడమిక్ ఇయర్‌లో ఎలాంటి మార్పులు లేవు. కానీ టీచింగ్, రీసెర్చ్అనుభవాల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 4 సంవత్సరాలు ఒకే సబ్జెక్టును బోధించాలి. అంతేగాక 2 రీసెర్చ్‌లు పబ్లిష్అయి ఉండాలి. ఇక క్లినికల్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మూడు సంవత్సరాల టీచింగ్అనుభవంతో పాటు, ఒక సంవత్సరం రెసిడెంట్ డాక్టర్‌గా మెడికల్కాలేజీలో పూర్తి చేయాలి. కానీ నాన్క్లినికల్అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రెసిడెంట్‌గా 3 సంవత్సరాల టీచింగ్అనుభవంతో పాటు ఒక సంవత్సరం ట్యాటర్‌గా మెడికల్ కాలేజీలో పూర్తి చేయాలి. వీరికి కూడా తెలంగాణ మెడికల్కౌన్సిల్లో దరఖాస్తు తప్పనిసరి.
కాగా, ప్రొఫెసర్లకు ప్రతీ నెల రూ.1,90,000, అసొసియేట్ప్రొఫెసర్కు రూ.1,50,000, అసిస్టెంట్ప్రొఫెసర్కు రూ.1,25,000 వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ర్టీ విభాగాల్లో పనిచేసే వారికి పైన పేర్కొన్న జీతానికి అదనంగా ప్రతీ నెల రూ.50 వేల అదనపు ఇన్సెంటీవ్‌లను కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇది తప్పుడు నిర్ణయం: డాక్టర్ రమేష్,మెడికల్ జేఏసీ చైర్మన్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తెస్తున్న కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానం విఫలమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. కేవలం సంవత్సర కాలం తాత్కాలిక జాబ్ కొరకు ప్రైవేట్‌లో రెట్టింపు స్థాయిలో జీతాలు తీసుకుంటునోళ్లు ఎందుకు వస్తారు?. కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కచ్చితంగా పర్మినెంట్పోస్టులకు నోటిఫికేషన్విడుదల చేసి భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కల నెరవేరుతుంది.