రికార్డులు బ్రేక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజులు ధరలు పెరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు బుధవారం మళ్లీ షాక్ తగిలింది. బుధవారం పెట్రోల్, డీజిల్ మళ్లీ ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.107.94కు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ.96.67కి పెరిగింది. దీంతో ఇంధన ధరలు బుధవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక, హైదరాబాద్‌లో లీటరు […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజులు ధరలు పెరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు బుధవారం మళ్లీ షాక్ తగిలింది. బుధవారం పెట్రోల్, డీజిల్ మళ్లీ ధరలు పెరిగాయి.
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.107.94కు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ.96.67కి పెరిగింది. దీంతో ఇంధన ధరలు బుధవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 36 పైసలు పెరగడంతో రూ.112.27కు చేరింది. డీజిల్ ధర లీటరుపై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరుకుంది.