నాలుగు రోజుల గ్యాప్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్: గతనాలుగు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచారు. ఈ ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా, ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 94.79, డీజిల్ రూ.88. 86కు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.2, డీజిల్ 90.72గా లభిస్తోంది. దీంతో వాహన దారులు బెంబేలెత్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: గతనాలుగు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచారు. ఈ ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా, ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 94.79, డీజిల్ రూ.88. 86కు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.2, డీజిల్ 90.72గా లభిస్తోంది. దీంతో వాహన దారులు బెంబేలెత్తున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి చమురు ధరలు పెరగడంలో అందరూ మరోసారి షాక్‌కు గురయ్యారు.