పెద్దపులి గుడి కట్టిన ఆదివాసీలు
దిశ, ఆదిలాబాద్: పెద్దపులి.. ఈ పేరు వింటేనే హడలిపోతారు.. కంటికి కనిపిస్తే మాత్రం గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ, ఆ ప్రాంతంలో ఏకంగా పెద్దపులికి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీలు.. సిర్పూర్ (టి) సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి గుడిని నిర్మించారు. ప్రతి యేటా కొత్త సాగు మొదలు పెట్టడానికి ముందే అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే అడవుల్లో జీవనం […]
దిశ, ఆదిలాబాద్: పెద్దపులి.. ఈ పేరు వింటేనే హడలిపోతారు.. కంటికి కనిపిస్తే మాత్రం గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ, ఆ ప్రాంతంలో ఏకంగా పెద్దపులికి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీలు.. సిర్పూర్ (టి) సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి గుడిని నిర్మించారు. ప్రతి యేటా కొత్త సాగు మొదలు పెట్టడానికి ముందే అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే అడవుల్లో జీవనం సాగిస్తున్న తమకు, తమ పశు సంపదకు హాని కలుగకుండా ఆ రారాజు చూసుకుంటాడని వారి నమ్మకం.