ఇంటర్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గ్రేడ్ల విధానంలో మార్కులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే ఫలితాల విడుదలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. గతంలో మాదిరిగా ఆల్ పాస్ కాకుండా గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఇంటర్ పరీక్ష ఫలితాలపై విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గ్రేడ్ల విధానంలో మార్కులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే ఫలితాల విడుదలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. గతంలో మాదిరిగా ఆల్ పాస్ కాకుండా గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఇంటర్ పరీక్ష ఫలితాలపై విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే టెన్త్ పరీక్షల ఫలితాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జగన్ ఆమోదం తెలిపిన తర్వాత ఎప్పుడు విడుదల చేసేది అనేదానిపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మరోవైపు టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.