పోలీస్ శాఖకు ఏఆర్ విభాగం గుండెకాయ: సుధీర్ బాబు

దిశ, క్రైమ్ బ్యూరో : పోలీసుల ప్రాణ త్యాగాల కారణంగానే ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు అన్నారు. అలాంటి పోలీస్ శాఖకు ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగం గుండెకాయ లాంటిదన్నారు. రాచకొండ సాయుధ పోలీస్ దళాలు (ఏఆర్) డీమొబిలైజేషన్ పరేడ్ అంబర్ పేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన అడిషనల్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… పోలీసులు ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలను నేర్చకోవడం […]

Update: 2021-02-17 01:56 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : పోలీసుల ప్రాణ త్యాగాల కారణంగానే ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు అన్నారు. అలాంటి పోలీస్ శాఖకు ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగం గుండెకాయ లాంటిదన్నారు. రాచకొండ సాయుధ పోలీస్ దళాలు (ఏఆర్) డీమొబిలైజేషన్ పరేడ్ అంబర్ పేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన అడిషనల్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… పోలీసులు ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలను నేర్చకోవడం నిరంతర ప్రక్రియ కావాలని సూచించారు. కోవిడ్ –19, వరదల సమయాల్లో ఏఆర్ సిబ్బంది చాలా బాగా పని చేశారని తెలిపారు. ఆందోళన సమయంలో గుంపులుగా వస్తే ఎలా అడ్డుకోవాలి, నిలువరించాలి, ఎలా అదుపులోకి తీసుకురావాలి, టెర్రరిస్టులు దాడులు చేస్తే ఎలా అడ్డుకోవాలనే విషయాలపై ఏఆర్ సిబ్బంది చేసిన డెమో ఆకట్టుకుంది.

Tags:    

Similar News