ఉపాధి హామీ కూలీలకు పని కల్పిస్తాం
దిశ, మెదక్: ఉపాధి హామీ కూలీలకు చేతినిండా పని కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 50 గ్రామాల పంచాయతీ సెక్రెటరీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు వంద శాతం పని కల్పించాలని చెప్పారు. అలాగే, జాబ్ కార్డు లేని వారికి కొత్త జాబ్ కార్డు కల్పించాలని సూచించారు. అనంతరం భూంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి […]
దిశ, మెదక్: ఉపాధి హామీ కూలీలకు చేతినిండా పని కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 50 గ్రామాల పంచాయతీ సెక్రెటరీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు వంద శాతం పని కల్పించాలని చెప్పారు. అలాగే, జాబ్ కార్డు లేని వారికి కొత్త జాబ్ కార్డు కల్పించాలని సూచించారు. అనంతరం భూంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి జిల్లా సరిహద్దు చెక్ పోస్టు వద్ద తనీఖీలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే వారికి తప్పని సరిగా స్క్రీనింగ్ నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లను జాయింట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు.
Tags: Additional Collector Muzamil Khan, meeting, Employment Guarantee, Checks, check post, Siddipet