వినియోగ‌దారుల‌కు క‌రెంట్ షాక్‌

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : డెవ‌ల‌ప్‌మెంట్ చార్జీల‌ పేరుతో విద్యుత్‌శాఖ‌ వినియోగ‌దారుల న‌డ్డీ విరుస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చీ రాని జీతాలు, కూలీ నాలి దొర‌క‌గా జీవితాలు దుర్భరంగా మారుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉన్న వారిని గుర్తించి కేవీల్లో అప్‌గ్రేడ్ ఇస్తూ వ‌సూళ్లకు దిగుతుండ‌టంపై వినియోగ‌దారులు మండిప‌డుతున్నారు. గృహ వినియోగ‌దారుల‌కు సంబంధించి ఎంత వినియోగిస్తే అంత చార్జీలు వ‌సూలు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెల‌ల విద్యుత్ వినియోగాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వారికి క‌నీసం […]

Update: 2021-04-06 01:27 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : డెవ‌ల‌ప్‌మెంట్ చార్జీల‌ పేరుతో విద్యుత్‌శాఖ‌ వినియోగ‌దారుల న‌డ్డీ విరుస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చీ రాని జీతాలు, కూలీ నాలి దొర‌క‌గా జీవితాలు దుర్భరంగా మారుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా ఉన్న వారిని గుర్తించి కేవీల్లో అప్‌గ్రేడ్ ఇస్తూ వ‌సూళ్లకు దిగుతుండ‌టంపై వినియోగ‌దారులు మండిప‌డుతున్నారు.

గృహ వినియోగ‌దారుల‌కు సంబంధించి ఎంత వినియోగిస్తే అంత చార్జీలు వ‌సూలు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెల‌ల విద్యుత్ వినియోగాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వారికి క‌నీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 1కేవీ ప‌రిధిలో ఉన్న వారిని 2కేవీ ప‌రిధిలోకి, 2 కేవీ ప‌రిధిలో ఉన్న వారిని 3కేవీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చి డెవ‌ల‌ప్‌మెంట్ చార్జీలు ప్రాతిప‌దిక‌న విధిస్తుండ‌టం గ‌మ‌నార్హం. జ‌న‌గామకు చెందిన చిరు వ్యాపారికి రూ.150 విద్యుత్ చార్జి, క‌స్టమ్ చార్జీ రూ.30 రాగా, ఎస్డీ రూ.400, డెవ‌ల‌ప్మెంట్ చార్జీలు రూ.2832 విధించ‌డం గ‌మ‌నార్హం. మొత్తం మార్చి నెల రూ.3418 బిల్లును చేతిలో పెట్టడంతో స‌ద‌రు చిరు వ్యాపారి చేతులు వ‌ణికిపోయాయి. ఇదేంట‌ని ప్రశ్నిస్తే అధికారుల ఆదేశాల‌తో మా ప‌ని మేం చేస్తున్నామంటూ బిల్లింగ్ సిబ్బంది చెప్పి వెళ్లిపోతున్నారు. ఇలాంటి బాధితులు ఇప్పుడు ఉమ్మడి వరంగ‌ల్ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నట్లుగా స‌మాచారం అందుతోంది.

 

Tags:    

Similar News