భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు!

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారీ లాభాలతో దూసుకెళ్తున్న అదానీ గ్రూపునకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) షాక్ ఇచ్చింది. ఈ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులను కలిగిన మూడు విదేశీ ఫండ్ ఖాతాలను నిలిపేసింది. అదానీ గ్రూపునకు చెందిన నాలుగు సంస్థల్లో ఈ విదేశీ కంపెనీలు రూ. 43,500 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉండగా, వాటిని ఎన్ఎస్‌డీఎల్ స్తంభింపజేసింది. దీంతో ఈ ఫండ్లు ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేన్నీ విక్రయించలేవు, కొనలేవు. ఎన్‌ఎస్‌డిఎల్ ఈ మూడు ఫండ్ […]

Update: 2021-06-14 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారీ లాభాలతో దూసుకెళ్తున్న అదానీ గ్రూపునకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) షాక్ ఇచ్చింది. ఈ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులను కలిగిన మూడు విదేశీ ఫండ్ ఖాతాలను నిలిపేసింది. అదానీ గ్రూపునకు చెందిన నాలుగు సంస్థల్లో ఈ విదేశీ కంపెనీలు రూ. 43,500 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉండగా, వాటిని ఎన్ఎస్‌డీఎల్ స్తంభింపజేసింది. దీంతో ఈ ఫండ్లు ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేన్నీ విక్రయించలేవు, కొనలేవు. ఎన్‌ఎస్‌డిఎల్ ఈ మూడు ఫండ్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి కారణాలను వెల్లడించకపోయినప్పటికీ, మనీలాండరింగ్ నిరొధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని అందించకపోవడంలో ఈ కంపెనీలు విఫలమైనట్టు జాతీయ మీడియా పేర్కొంది.

అదానీ గ్రూప్‌లో మొత్తం 6 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన మూడు కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ సంస్థలో వాటాలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోకి నకిలీ కంపెనీలతో పెట్టుబడులు వచ్చాయనే సంకేతాలతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో మదుపర్లు అదానీ గ్రూపునకు చెందిన షేర్ల అమ్మకానికి సిద్ధపడటంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 25 శాతం కుప్పకూలాయి. అదానీ పోర్ట్స్ షేర్ 19 శాతం, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి.

Tags:    

Similar News