ఆ హీరోయిన్లకు ఎన్‌సీబీ సమన్లు
న్యూఢిల్లీ: సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లతోపాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాటాలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఈ వారంలో సమన్లు జారీ చేయనుంది. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం రియా చక్రవర్తిపై నమోదైన డ్రగ్స్ కేసులో ఈ నలుగురు నటీమణులను ఎన్‌సీబీ విచారించడానికి ఉపక్రమించింది. వీరంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో మహారాష్ట్రలోని లోనావాలాలోని అతని ఫామ్‌హౌజ్ కలిసి పార్టీలు చేసుకునేవారని తెలిసింది. రియా చక్రవర్తి, […]
న్యూఢిల్లీ: సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లతోపాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాటాలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఈ వారంలో సమన్లు జారీ చేయనుంది. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం రియా చక్రవర్తిపై నమోదైన డ్రగ్స్ కేసులో ఈ నలుగురు నటీమణులను ఎన్‌సీబీ విచారించడానికి ఉపక్రమించింది.
వీరంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో మహారాష్ట్రలోని లోనావాలాలోని అతని ఫామ్‌హౌజ్ కలిసి పార్టీలు చేసుకునేవారని తెలిసింది. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ సహా ఇతర సినీ పరిశ్రమ మిత్రులతో సుశాంత్ సింగ్ తన లోనావాలా ఫామ్‌హౌజ్‌లో పార్టీలు చేసుకునేవారని బోట్‌మన్ జగదీష్ దాస్ ఎన్‌సీబీకి తన వాంగ్మూలంలో వివరించారు.
రియా చక్రవర్తి కూడా తన స్టేట్‌మెంట్‌లో సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పార్టీలు చేసుకునేవారమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వీరికి తాకీదులు పంపనున్నట్టు తెలిసింది. రియా చక్రవర్తి సహా కనీసం 18 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబయిలోని బైకుల్లా జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.