ఏఎస్ రావునగర్‌లో సందడి చేసిన సినీ నటి క్రితిశెట్టి..

దిశ, ఉప్పల్: హైదరాబాద్ ఏఎస్ రావునగర్ లో సినీ నటి క్రితిశెట్టి సందడి చేశారు. ఏఎస్‌ రావు నగర్‌లో ఏర్పాటు చేసిన ‘మాంగళ్య షాపింగ్‌ మాల్‌’ 10వ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సినీ నటి ఉప్పెన ఫేమ్ క్రితిశెట్టిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌ రెడ్డి, వివేకానంద, స్థానిక కార్పొరేటర్ […]

Update: 2021-07-05 07:30 GMT

దిశ, ఉప్పల్: హైదరాబాద్ ఏఎస్ రావునగర్ లో సినీ నటి క్రితిశెట్టి సందడి చేశారు. ఏఎస్‌ రావు నగర్‌లో ఏర్పాటు చేసిన ‘మాంగళ్య షాపింగ్‌ మాల్‌’ 10వ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సినీ నటి ఉప్పెన ఫేమ్ క్రితిశెట్టిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌ రెడ్డి, వివేకానంద, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డి, మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ఫౌంఢర్‌ పీఎన్‌ మూర్తి, చైర్మన్‌ కాసం నమశ్శివాయ, మాంగళ్య షాపింగ్‌ మాల్‌ డైరక్టర్లు కాసం శివప్రసాద్‌, పుల్లూరు అరుణ్‌లు పాల్గొన్నారు. అతిపెద్ద కుటుంబ వస్త్ర ప్రపంచంలో మాంగళ్య షాపింగ్‌మాల్‌ ప్రత్యేకతను చాటుకుంటూ విస్తరిస్తోంది. నటీ క్రితి శెట్టి షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్‌ మాల్‌ తమ ఫ్యాషన్‌ దుస్తులతో కస్టమర్ల నమ్మకాన్ని పొందటంతో పాటు నాణ్యమైన మన్నికైన దుస్తులకు మారుపేరుగా నిలుస్తోందన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్ కు తెలంగాణలో ఇది 10వ షోరూం కాగా, గత 2 ఏళ్ళ వ్యవధిలో 7 స్టోర్లను ప్రారంభించిందని, సంస్థలో 3500 మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. నగరంలో మాంగళ్య షాపింగ్‌మాల్‌ ప్రవేశించి రెండేళ్లు పూర్తి చేసుకుందని ఫ్యాషన్‌ ప్రేమికులు ఇష్టపడే డిజైన్లను వెరైటీలను ఇప్పుడు ఒకే చోటి నుంచి పొందవచ్చని నిర్వహకులు పీఎన్‌ మూర్తి తెలిపారు. ఈ షాపింగ్‌ మాల్‌లో విస్త్రృత శ్రేణికి చెందిన చీరలు, వెస్ట్రన్‌ వేర్‌, వెడ్డింగ్‌ వేర్‌, డ్రస్‌ మెటీరియల్స్‌తో పలు రకాల వస్త్రాలను వినియోగదారులు అభిరుచికి అనుగుణంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, పావనిరెడ్డి , టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాఘవరెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News