సినిమాలపై రాజకీయ జోక్యం సరికాదు : శరత్ కుమార్

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ పై తాజాగా వివాదం నెలకొనగా.. దీనిపై నటుడు శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలపై రాజకీయ ఒత్తిడి ఉండటం మంచిది కాదన్నారు.నటీనటుల పాత్రలను రాజకీయ నేతలు నిర్ధేశించడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. సినిమా కథలకు అడ్డుగోడలు ఉండకూడదని.. ఎవరి మనోభావాలు కించపర్చకుండా సినిమాలు నిర్మిస్తే చాలని తెలిపారు. మురళీధరన్ బయోపిక్ పై రాజకీయ వివాదం సరికాదని.. నిర్మాణ సంస్థ, […]

Update: 2020-10-17 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ పై తాజాగా వివాదం నెలకొనగా.. దీనిపై నటుడు శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలపై రాజకీయ ఒత్తిడి ఉండటం మంచిది కాదన్నారు.నటీనటుల పాత్రలను రాజకీయ నేతలు నిర్ధేశించడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు.

సినిమా కథలకు అడ్డుగోడలు ఉండకూడదని.. ఎవరి మనోభావాలు కించపర్చకుండా సినిమాలు నిర్మిస్తే చాలని తెలిపారు. మురళీధరన్ బయోపిక్ పై రాజకీయ వివాదం సరికాదని.. నిర్మాణ సంస్థ, నటీనటులను కించపరచడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అన్ని అడ్డంకులు తొలగించుకుని సినిమా విడుదలవ్వాలని శరత్ కుమార్ కోరారు.

Tags:    

Similar News