పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… పవన్ తీసుకున్న నిర్ణయాలతో నిరాశ చెందానని, జనసేన పార్టీ నేలతకు కూడా ఇష్టం లేని పనులు పవన్ చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఊసరవెల్లిలా మారిపోతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ బీజేపీతో కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం […]

Update: 2020-11-27 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… పవన్ తీసుకున్న నిర్ణయాలతో నిరాశ చెందానని, జనసేన పార్టీ నేలతకు కూడా ఇష్టం లేని పనులు పవన్ చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఊసరవెల్లిలా మారిపోతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ బీజేపీతో కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కన్నా… జనసేన పార్టీని నేరుగా బీజేపీలోనే కలిపేస్తే సరిపోతుంది కదా అని హితవు పలికారు. పవన్‌కు అసలు మనస్సాక్షి అనేది ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రమాదకర పార్టీ అని, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి, నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రకాష్ రాజ్ తూర్పారబట్టారు.

Tags:    

Similar News