సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ ఇకలేరు..

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తరచుగా డయాలసిస్ చేయించుకునేవారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 1963 మే 15న మైలా నర‌సింహ యాద‌వ్‌ హైద‌రాబాద్‌లో జన్మించారు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర్సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు. ఆయనకు భార్య చిత్ర‌, […]

Update: 2020-12-31 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తరచుగా డయాలసిస్ చేయించుకునేవారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

1963 మే 15న మైలా నర‌సింహ యాద‌వ్‌ హైద‌రాబాద్‌లో జన్మించారు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర్సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు. ఆయనకు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. తెలుగు, హిందీ, త‌మిళ భాషల్లో కలిపి 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషా చిత్రంలోనూ మంచి పాత్రను పోషించారు. నర్సింగ్ యాదవ్‌కు విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ క‌త్వం వ‌హించిన ‘హేమా హేమీలు’ మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన పాత్రలకు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇటీవ‌ల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోనూ నర్సింగ్ తనదైన నటన కనబరిచారు.

 

Tags:    

Similar News