ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా జరుగుతున్నాయి

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని, దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 6,379 కేంద్రాల ద్వారా 47.97లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిచినట్లు వివరించారు. ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ. 5,537కోట్లు జమ చేశామన్నారు. సోమ, మంగళవారాల్లో మరో రూ.860 కోట్లు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు 77.79 లక్షల మంది లబ్దిదారులకు 3లక్ష 12వేల మెట్రిక్ టన్నుల […]

Update: 2020-05-19 10:09 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని, దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 6,379 కేంద్రాల ద్వారా 47.97లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిచినట్లు వివరించారు. ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ. 5,537కోట్లు జమ చేశామన్నారు. సోమ, మంగళవారాల్లో మరో రూ.860 కోట్లు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు 77.79 లక్షల మంది లబ్దిదారులకు 3లక్ష 12వేల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం అందజేశామన్నారు. కంది పప్పు 4,044 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని పేర్కొన్నారు.

Tags:    

Similar News