మహారాష్ట్రలో దారుణం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని మహిళా లెక్చరర్ మీద యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకెళితే..దడోరా గ్రామానికి చెందిన ఓ మహిళ విదర్భలోని హింఘన్‌ఘాట్ జిల్లా నందోరీ చౌక్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. దడోరా గ్రామానికే చెందిన వికేశ్ (27)కు పెళ్లయింది. ఏడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా ఆ మహిళ వెంటపడి వేధించేవాడు. అతని ప్రవర్తన నచ్చక మహిళ అతన్ని దూరంగా పెట్టింది. దూరం […]
మహారాష్ట్రలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని మహిళా లెక్చరర్ మీద యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకెళితే..దడోరా గ్రామానికి చెందిన ఓ మహిళ విదర్భలోని హింఘన్‌ఘాట్ జిల్లా నందోరీ చౌక్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. దడోరా గ్రామానికే చెందిన వికేశ్ (27)కు పెళ్లయింది. ఏడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా ఆ మహిళ వెంటపడి వేధించేవాడు. అతని ప్రవర్తన నచ్చక మహిళ అతన్ని దూరంగా పెట్టింది. దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన వికేశ్ నిన్న ఉదయం కళాశాల వద్ద కాపుకాశాడు. మహిళ బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగి, వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే బైక్‌పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.