అమాత్యుల ఇంట్లో ‘ఆచార్య’.. ఎన్ని రోజులో?
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్.. ట్రెండింగ్‌లో నిలవగా, సమ్మర్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. రాంచరణ్ కూడా ఈ సినిమాలో ‘సిద్ధ’గా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండగా, రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కూడా. కాగా, ఈ సినిమా విషయమై డైరెక్టర్ కొరటాల శివ, తెలంగాణ రవాణా […]
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్.. ట్రెండింగ్‌లో నిలవగా, సమ్మర్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. రాంచరణ్ కూడా ఈ సినిమాలో ‘సిద్ధ’గా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండగా, రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కూడా. కాగా, ఈ సినిమా విషయమై డైరెక్టర్ కొరటాల శివ, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘ఆచార్య’లోని కొన్ని సీన్లను ఖమ్మం జిల్లాలోని గనుల్లో చిత్రీకరించాలనుకున్న డైరెక్టర్.. అందుకు అనుమతివ్వాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి, కావలసిన అనుమతులు ఇప్పించారని సమాచారం. అంతేకాదు షూటింగ్ జరిగినన్ని రోజులు, చిరంజీవి తన నివాసంలోనే ఉండాలని మంత్రి ఈ సందర్భంగా కోరినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 7 నుంచి 15 వరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు పర్మిషన్ ఇప్పించిన మంత్రి పువ్వాడకు కొరటాల థాంక్స్ చెప్పారు.
కాగా కొన్నిరోజుల కిందట ‘ఆచార్య’ షూటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవిని, కొరటాల శివను మంత్రి కలిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక‌్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.