హత్య కేసులో అనుమానితుడి ఆత్మహత్య

దిశ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన పుర్రె మమత హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అదివారం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మమత కేసులో అనుమానితుడిగా పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న గొల్ల గంగాధర్ (43) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, కుటుంబికులు అక్కడికి చెరుకుని ఆందోళనకు దిగారు. కాగా ఆయన మృతికి పోలీసులే […]

Update: 2020-12-06 06:06 GMT

దిశ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన పుర్రె మమత హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అదివారం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మమత కేసులో అనుమానితుడిగా పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న గొల్ల గంగాధర్ (43) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, కుటుంబికులు అక్కడికి చెరుకుని ఆందోళనకు దిగారు. కాగా ఆయన మృతికి పోలీసులే కారణమంటూ గ్రామంలో మృతదేహాన్ని చెట్టు నుండి తీయకుండా అలాగే ఉంచాలనీ, విచారణ వెంటనే చేపట్టాలంటూ గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. పోలీసుల వేధింపులు తాళలేకే అతను తనువు చాలించాడని గ్రామస్తులు, మహిళలు నిరసన తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన సీఐ ప్రసాద్, ఎస్సై రాజశేఖర్‌ లను గ్రామస్తులు ఘెరావ్ చేశారు.

Tags:    

Similar News