క్రెడిట్ కార్డు బిల్ కట్టమంటే ప్రాణం తీశాడు

దిశ‌, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం జ‌రిగిన హ‌త్య‌కేసులో త్రీ టౌన్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ నేపథ్యంలోనే శ‌నివారం ఇద్ద‌రు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీన రాత్రి కొత్తగూడెం మేదరబస్తికి చెందిన చింతల అనిల్ కుమార్ (29)హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. ఈ హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌కుడిగా భావిస్తున్న ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన సాయికుమార్‌ (20) ఏ-1గా, మేదర బస్తీకి చెందిన ఎండి.సల్మాన్‌ను(23) ఏ2గా పేర్కొంటూ […]

Update: 2020-06-20 08:21 GMT

దిశ‌, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం జ‌రిగిన హ‌త్య‌కేసులో త్రీ టౌన్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ నేపథ్యంలోనే శ‌నివారం ఇద్ద‌రు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీన రాత్రి కొత్తగూడెం మేదరబస్తికి చెందిన చింతల అనిల్ కుమార్ (29)హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. ఈ హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌కుడిగా భావిస్తున్న ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన సాయికుమార్‌ (20) ఏ-1గా, మేదర బస్తీకి చెందిన ఎండి.సల్మాన్‌ను(23) ఏ2గా పేర్కొంటూ త్రీటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు శ‌నివారం ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

కేసు వివరాళ్లోకి వెళితే:

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేయబడ్డ చింతల అనిల్ కుమార్.. నిందితుడు సాయికుమార్‌‌కు స్వయానా మేనమామ. గతంలో అనిల్ కుమార్ వద్ద నున్న క్రిడిట్ కార్డులను సాయికుమార్ తరుతూ వినియోగించేవాడు. మొత్తం ఆరు క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 5 లక్షలకు పైగా నగదును వాడుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నా చివరకు తిరిగి చెల్లించలేదు. ఈ వ్యవహారంలోనే ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. దీంతో మేనమామను హత్య చేయాలని భావించిన మేనల్లుడు.. తన స్నేహితుడైన సల్మాన్‌కు ఓ కత్తిని తయారు చేయించమన్నాడు. సల్మాన్ కత్తి రెడీ అయిందని చెప్పిన వెంటనే సాయికుమార్ హత్యకు ప్లాన్ వేశాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి 10.30 గంటలకు అనిల్ కుమార్ నిద్రిస్తున్నసమయంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మేదరబస్తిలోనే ఓ శిథిలావస్థ ఇంట్లో దాక్కున్నారని సమాచారం అందడంతో.. నిందితులను అరెస్ట్ చేశామని సీఐ ఆదినారాయణ తెలిపారు.

Tags:    

Similar News